సరిహద్దుల్లో ఏకంగా ఇళ్ళు కట్టుకుంటున్న రైతులు

Protesting Farmers Build Homes By Highway Near Delhi. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు

By Medi Samrat  Published on  13 March 2021 7:35 PM IST
సరిహద్దుల్లో ఏకంగా ఇళ్ళు కట్టుకుంటున్న రైతులు

కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారి ఆందోళనలను పట్టించుకోవడం లేదు. దీంతో సరిహద్దుల్లో నిరసన చేస్తున్న ప్రాంతాల్లో ఏకంగా ఇళ్లను కట్టుకోవాలని రైతులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఇళ్లను కూడా కట్టేసుకున్నారు. కొత్త సాగు చట్టాలను ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కు తాము వెనుదిరిగేది లేద‌ని రైతులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో కొన‌సాగుతోన్న వారి ఆందోళ‌న‌లు సుదీర్ఘ‌కాలం జ‌రిగే అవ‌కాశం ఉండడంతో సరిహద్దుల్లో వారు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టారు. ఇప్పటివ‌ర‌కు 25 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయ‌ట.. తాము మొత్తం 1000 నుంచి 2,000 మ‌ధ్య‌ ఇళ్లను నిర్మించుకుంటామ‌ని రైతు సంఘాల నేత‌లు చెప్పారు. సరిహద్దుల్లోని మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ ఇళ్ల‌ను నిర్మించుకుంటున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం చెబుతుండ‌గా, వాటిని పూర్తిగా ర‌ద్దు చేయాల్సిందేన‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 26న భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణ‌యించాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహాపంచాయత్ పేరుతో సభలు నిర్వహించి, ప్రజా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను కూడా తమ ఉద్యమానికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. 'మేం ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.. ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు.. రైతుల మనోభావాలు, అభిప్రాయాలకే వ్యతిరేకమైన బీజేపీకి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. వారికి తప్పా ఇంకేదైనా పార్టీకి ఓటువేసుకోండి' అని ఎస్‌కేఎమ్‌ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు.


Next Story