మమతా బెనర్జీతో భేటీకి సిద్ధమైన వైద్యులు

ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధుల్లో చేరడంపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వంతో సమావేశం అయ్యేందుకు అంగీకరించారు

By Medi Samrat  Published on  11 Sept 2024 3:30 PM IST
మమతా బెనర్జీతో భేటీకి సిద్ధమైన వైద్యులు

ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధుల్లో చేరడంపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వంతో సమావేశం అయ్యేందుకు అంగీకరించారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశానికి 10-15 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని పంపాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం వైద్యులను కోరింది. సెప్టెంబరు 10 సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వారు తమ నిరసనలను కొనసాగించడంతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు లేఖ రాసి సమావేశంలో పాల్గొనాలని కోరింది. బుధవారం ఉదయం వైద్యులు సమావేశానికి అంగీకరించారు.

నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులను మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. నిరసనలు చేస్తున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కూడా కోరింది. నిరసన తెలుపుతున్న వైద్యులపై బదిలీలతో సహా ఎలాంటి చర్యలు తీసుకోబోమని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Next Story