పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఆమె ఆలోచనలు, ప్రయాణాల గురించి రాసింది. గూఢచర్యం ఆరోపణలపై గత రెండు వారాలుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండి అరెస్టు చేసిన 11 మందిలో 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. 'ట్రావెల్ విత్ JO' అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడిపిన జ్యోతిని మే 16న న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్ నుండి అరెస్టు చేశారు.
జ్యోతి అనేక సార్లు పాకిస్తాన్‌ను కూడా సందర్శించింది.. అందుకు సంబంధించిన వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌కు అనుకూలంగా మార్చుకోడానికి ISI జ్యోతిని ఉపయోగించుకుంది. 2023 సంవత్సరంలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కి వీసా పొందడానికి న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె పాకిస్థాన్ హైకమిషన్ చీఫ్ ఎహసాన్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్‌ను కలిసింది. డానిష్, జ్యోతి మొదటి సమావేశంలో స్నేహితులయ్యారు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలెట్టారు. క్రమంగా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని తెలుస్తోంది.