రేపు హైద్రాబాద్‌కు ప్రియాంక గాంధీ కుటుంబం

Priyanka Gandhi Visits For Hyderabad Tomorrow. కాంగ్రెస్ నేత‌ ప్రియాంక గాంధీ.. త‌న‌ కుమారుడు రైహాన్ కంటి చికిత్స కోసం హైదరాబాద్

By Medi Samrat  Published on  23 Nov 2021 7:38 PM IST
రేపు హైద్రాబాద్‌కు ప్రియాంక గాంధీ కుటుంబం

కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ.. త‌న‌ కుమారుడు రైహాన్ కంటి చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నారు. నాలుగున్నరేళ్ల క్రితం రైహాన్ క్రికెట్ ఆడతుండగా కంటికి గాయం అయ్యింది. దీంతో ఎయిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. వైద్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రిఫ‌ర్ చేశారు. దీంతో అప్పట్లో రైహాన్‌కు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స జ‌రిగింది. మరోసారి చికిత్స నిమిత్తం రేపు రైహాన్ కుటుంబం హైద్రాబాద్‌ వస్తుంది. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.


Next Story