హిమాచల్ సీఎంను ఖరారు చేసే బాధ్యత ఆమెపైనే..!

Priyanka Gandhi Likely To Name Himachal Chief Minister. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  10 Dec 2022 5:30 PM IST
హిమాచల్ సీఎంను ఖరారు చేసే బాధ్యత ఆమెపైనే..!

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..! ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలా అనే ప్రశ్న కాంగ్రెస్ అధిష్టానాన్ని వెంటాడుతూ ఉంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో.. 40 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్‌. హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సుఖ్వీందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా సీఎం రేసులో ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు. కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు, అనేక ర్యాలీలతో పాటు, ఎన్నికల కోసం వ్యూహాల ప్రణాళికలో కూడా పాలు పంచుకున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రియాంక గాంధీనే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోస. ప్రియాంక ఎవరి పేరు ప్రతిపాదిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 40 ఎమ్మెల్యేలు శుక్రవారం సిమ్లాలో సమావేశయ్యారు. సీఎంను ఖరారు చేసే బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పర్యవేక్షకులు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేష్ బఘేల్‌ కూడా హాజరయ్యారు. వీళ్లు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.


Next Story