ఓ మై గాడ్‌.. వారి మోకాళ్లు క‌న‌ప‌డుతున్నాయో..! : సీఎంకు ప్రియాంక కౌంట‌ర్‌

Priyanka Gandhi Counter To Uttarakhand CM. ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.

By Medi Samrat
Published on : 19 March 2021 10:11 AM IST

Priyanka Gandhi Counter To Uttarakhand CM

ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఫైర్ అయ్యారు. ఈ విష‌య‌మై ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫార్మ్‌ ధరించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ ల ఫొటోలను షేర్ చేస్తూ.. ఓ మై గాడ్‌.. వారి మోకాళ్లు కనబడుతున్నాయంటూ రాసి.. దానికి షాకింగ్‌ ఎమోజీని జ‌త‌చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.


ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్ ఇటీవ‌ల అమ్మాయిల రిప్పిడ్‌ జీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? సమాజ సేవ చేసేవారు కనీస బాధ్యత లేకుండా ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే ఎదుటి వారు ఎలా భావిస్తారన్న విషయం తెలుసుకోవాలని అన్నారు.

మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అన్నారు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే.. మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌సింగ్ రావత్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు.

ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పు అన్నట్టు సీఎం చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అయితే.. ఈ వ్యాఖ్యలపై పలువురు ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, థీరత్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఆయన భార్య సమర్థించడం గమనార్హం.


Next Story