పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 27న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో 27 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. అందువల్ల ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో ఏమి మాట్లాడుతారోననే టెన్షన్ కాస్త నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే అన్నారు. ఇది అందరికీ పరీక్షా సమయమని, సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు.