భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, నితిన్ నబీన్‌ను ‘మిల్లేనియల్ నాయకుడు’గా అభివర్ణించిన మోదీ, ఆయన పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. “పార్టీ విషయానికి వస్తే నితిన్ నబీన్‌నే బాస్. నేను కేవలం ఒక పార్టీ కార్యకర్తనే” అని ప్రధాని వ్యాఖ్యానించడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నితిన్ నబీన్‌కు అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్తి సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని మోదీ ప్రశంసించారు. “నేటి యువత భాషలో చెప్పాలంటే నితిన్‌జీ ఒక విధంగా మిల్లేనియల్ నాయకుడే. ఆయన బాల్యంలో రేడియో ద్వారా సమాచారాన్ని పొందిన తరం. ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)ను చురుకుగా ఉపయోగిస్తున్న తరం. భారతదేశంలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులను ప్రత్యక్షంగా చూసిన తరం నుంచి ఆయన వచ్చారు. యువశక్తితో పాటు, సంఘటనాత్మకంగా విశాల అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇది పార్టీ కార్యకర్తలందరికీ ఎంతో ఉపయోగపడుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు.