ఓటర్ ఒక భాగ్య విధాత..జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మోదీ విషెస్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 12:46 PM IST

National News, Delhi, Pm Modi, National Voters’ Day, Election Commission Of India

ఓటర్ ఒక భాగ్య విధాత..జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మోదీ విషెస్

ఢిల్లీ: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నిరంతరం పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలని ప్రజలను కోరారు. వికసిత్ భారత్ వైపు సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఇది అవసరమని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మన ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘంతో సంబంధం ఉన్న వారందరికీ నా అభినందనలు" అని ఆయన అన్నారు.

ఓటరుగా ఉండటం కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రతి పౌరుడికి స్వరం ఇచ్చే ముఖ్యమైన విధి. ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనడం ద్వారా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిద్దాం, తద్వారా విక్షిత్ భారత్ పునాదులను బలోపేతం చేద్దాం" అని మోదీ అన్నారు. "ప్రజాస్వామ్యంలో ఓటరుగా ఉండటం గొప్ప హక్కు మరియు బాధ్యత" అని ప్రధానమంత్రి అన్నారు. ఓటు వేయడం అనేది "పవిత్రమైన రాజ్యాంగ హక్కు మరియు భారతదేశ భవిష్యత్తులో భాగస్వామ్యానికి గుర్తు" అని కూడా అన్నారు.

కాగా 1950లో స్థాపించబడిన భారత ఎన్నికల సంఘం (ECI) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఓటర్లను గుర్తించడం, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం మరియు సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రోత్సహించడం ఈ దినోత్సవ లక్ష్యం.

Next Story