రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.

By Knakam Karthik
Published on : 7 May 2025 2:29 PM IST

National News, Operation Sindoor, President Droupadi Murmu, PM Modi, Pahalgam Terror Attack, Indian Army

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ

పహల్గాంలో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు.

రేపు అపోజిషన్ మీటింగ్..

కాగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

అమిత్‌షా అత్యున్నతస్థాయి సమీక్ష

ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు. ఈ భేటీకి జమ్మూకశ్మీర్‌, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరుకానున్నారు.

Next Story