ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
By - Knakam Karthik |
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది. ఇథియోపియా దేశం అందించే అత్యున్నత పురస్కారం 'ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రధాని మోదీకి ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ మంగళవారం ప్రదానం చేశారు. ఈ అవార్డును స్వీకరించిన తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్రలో నిలిచారు. అడిస్ అబాబాలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అధికారికంగా అందించారు.
భారత్-ఇథియోపియా మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ పోషించిన కీలక పాత్రకు,అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ఒక ప్రకటనలో వెల్లడించింది. అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ,'ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' పురస్కారం తనకు దక్కడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ గౌరవాన్ని 140కోట్ల మంది భారతీయ ప్రజలకు అంకితం చేస్తున్నానని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ,ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Grateful to the people and Government of Ethiopia as well as Prime Minister Abiy Ahmed Ali for conferring upon me the ‘Great Honour Nishan of Ethiopia’ last evening. To be honoured by one of the world’s most ancient and rich civilisations is a matter of immense pride. This honour… pic.twitter.com/MWrdGwVFcI
— Narendra Modi (@narendramodi) December 17, 2025