పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూస్తాయి సంస్థలతో సమన్వయం పాటించాల్సిన అవసరం గురించి మంత్రిత్వ శాఖలకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచారమరియు ప్రసార శాఖ, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంపై ఈ మీటింగ్‌లో సమీక్షించారు. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయం, వ్యవస్థాగతంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ హైలెట్ చేశారు.
ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతను సమీక్షించారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాకలాపాలను సమీక్షించేందుకు, అత్యవసర ప్రతిస్పందన, అంతర్గత సమాచార వ్యవస్థలపై దృష్టితో సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శును ఆదేశించారు. ప్రతి మంత్రిత్వ శాఖ తమ సన్నాహకాలను వివరించింది. మంత్రిత్వ శాఖలు తమ చర్యలను ఇప్పటికే గుర్తించి, తక్షణమే అమలులో పెట్టేలా సిద్ధంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థల బలోపేతం, తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్‌ను ఎదుర్కోవడం, ముఖ్యమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశం సున్నిత సమయంలో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. సంస్థల మధ్య సమన్వయం, స్పష్టమైన సమాచార వ్యవస్థలు అవసరం. జాతీయ భద్రత, ప్రజల భద్రత, ప్రాథమిక సన్నద్ధతకు తమ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.