భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వల్ప అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే ఆయన శుక్రవారం రోజు ఆస్పత్రిలో చేరారు. అయితే, తాజాగా రాంనాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పిటల్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు వైద్యులు. మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఎయిమ్స్‌కు సిఫారసు చేసినట్లు కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. మరిన్ని పరీక్షలు, పర్యవేక్షణ తర్వాత ఈ నెల 30న ఆయనకు బైపాస్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో కోవింద్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు వైద్యులు.
ఇదిలావుంటే.. స్వల్ప అనారోగ్యానికి గురైన రాష్ట్రపతి కోవింద్.. ఢిల్లీలోని ఆర్‌అండ్‌ఆర్ హాస్పిటల్‌లో చేరారు. ఈ వార్త విన్న కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామార్శించారు. బంగ్లా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి కుమారుడికి ఫోన్ చేసి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక రాష్ట్రపతి కార్యాలయం కూడా.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన చేసింది.