రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ

President Droupadi Murmu undergoes cataract surgery at Army hospital in Delhi. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది.

By Medi Samrat  Published on  16 Oct 2022 8:30 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వివరాలను వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 64 ఏళ్ల ముర్ము జూలైలో 15వ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా కర్ణాటక, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో ఆమె పర్యటించారు. "...Murmu underwent cataract surgery today.... Surgery was successful and she has been discharged from the hospital," అంటూ ఆమె సర్జరీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వం పంచుకుంది.


Next Story