జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పాట్నాలో బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ వస్తే స్థానికులు అడ్డుకుంటారని హెచ్చరించారు. పీకే పేర్కొన్నట్లే, రేవంత్ గతంలో బీహార్-ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, ఆ మాటలకు బాధ్యత వహించాలన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠ పెరిగిన నేపథ్యంతో, జనసూరాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ బుధవారం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు .
రేవంత్ బీహార్ రాజకీయాల్లో ఏమి చేస్తున్నాడో, బీహార్ కు ఎందుకు వస్తున్నారో స్పష్టం కావాలి, లేకపోతే బీహార్ గ్రామాల్లోను పట్టణాల్లోను అతడిని స్థానికులు కర్రలు తీసుకుని తరిమి కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బీహార్ ప్రచారంలో రేవంత్‌ను ఆహ్వానించిన తీరు పీకే ఆవేశానికి దారి తీసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు బీహార్ నాయకులు పీకే వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలలో బీహారీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వాతావరణంలో ఇటువంటి వ్యాఖ్యలు స్థానీయ హీట్‌ను మరింత పెంచే ప్రమాదం ఉంది.