ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్న ప్రశాంత్ కిశోర్

Prashant Kishor hints at political plunge, beginning from Bihar. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రానున్నారు.

By Medi Samrat  Published on  2 May 2022 12:05 PM IST
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్న ప్రశాంత్ కిశోర్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రానున్నారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రశాంత్ వెల్లడించారు. ''పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిచాను. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువవ్వాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు'' ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రశాంత్ కిషోర్ 2014 జాతీయ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..! ఇక చిరకాల ప్రత్యర్థులు లాలూ యాదవ్, నితీష్ కుమార్ మధ్య చారిత్రాత్మక పొత్తు కుదిర్చి.. 2015లో బిహార్‌లోబీజేపీని ఓడించడంలో సహాయపడ్డారు. 2017లో కాంగ్రెస్ కోసం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం పంజాబ్ లో పని చేశాడు. వైసీపీ తరపున కూడా ప్రశాంత్ కిశోర్ పని చేసిన సంగతి తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఘన విజయం లోనూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2020లో తిరిగి అధికారం లోకి రావడం లోనూ, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ 2021 లో ఎన్నికవ్వడం, బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.










Next Story