ప్రశాంత్ కిషోర్ 5 సార్లు ఫోన్ మార్చారట.. అయినా కూడా..!

Prashant Kishor Hacked by Pegasus. పెగాస‌స్ హ్యాకింగ్ వ్యవహారంలో భాగంగా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల

By Medi Samrat  Published on  19 July 2021 8:10 PM IST
ప్రశాంత్ కిషోర్ 5 సార్లు ఫోన్ మార్చారట.. అయినా కూడా..!

పెగాస‌స్ హ్యాకింగ్ వ్యవహారంలో భాగంగా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిశోర్‌ ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా హ్యాకింగ్‌ కొనసాగుతోందని అన్నారు. 2018 నుంచి 2019 మ‌ధ్య పెగాస‌స్ స్పైవేర్‌తో వాళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఓ నివేదిక‌లో తేలింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ హ్యాకింగ్ త‌తంగం సాగిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్‌ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ కూడా ఉన్నారు. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్‌ను కేంద్రం హ్యాక్‌ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేశారని, జూలై 14 చివరిసారి ట్యాప్‌ అయినట్టు తెలుస్తోంది.

ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ ద్వారా సుమారు 300 మంది భార‌తీయుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జ‌ర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసిన‌ట్లు సమాచారం.


Next Story