కాలుష్యంతో కరోనా మరణాలు పెరిగే ఛాన్స్: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

Pollution can lead to more severe cases of Covid. గాలి కాలుష్యంతో కరోనా మహమ్మారి విజృంభణ అధికమవుతుందని ఎయిమ్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. ఆస్తమా రోగులకు

By అంజి  Published on  6 Nov 2021 5:04 PM IST
కాలుష్యంతో కరోనా మరణాలు పెరిగే ఛాన్స్: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

గాలి కాలుష్యంతో కరోనా మహమ్మారి విజృంభణ అధికమవుతుందని ఎయిమ్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. ఆస్తమా రోగులకు గాలి కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని, ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ అవుతుందని అన్నారు. మహమ్మారి కరోనా కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే గాలి కాలుష్యం వల్ల కరోనా బాధితుల పరిస్థితి విషమించే ఛాన్స్‌ ఉందని రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ఇది కరోనా రోగుల మరణానికి కూడా దారి తీయొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, వీలైతే ఎన్‌ 95 మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు కాలుష్యం, కరోనా నుంచి రక్షిస్తాయని గులేరియా సూచించారు.

ఢిల్లీలో ఇప్పటికే పెద్ద మొత్తంలో గాలి కాలుష్యం అయ్యింది. దానికి తోడు దీపావళి పండగ సందర్భంగా పేల్చిన బాణసంచా, టపాకులతో కాలుష్య తీవ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. ఇవాళ ఢిల్లీలో కాలుష్య పరిస్థితి కొంచెం చక్కబడింది. అయితే ఢిల్లీలో కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. గాలి కాలుష్యానికి, కరోనా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా రెండు విధాలుగా వివరించారు. గాలి కాలుష్య తీవ్రత ఎక్కువ ఉన్న చోట వైరస్‌ ఎక్కువ కాలం ఉంటుందని రిపోర్ట్‌లు చెబుతున్నాయని అన్నారు. 2003లో సార్స్‌ మహమ్మారి వ్యాప్తి జరిగినప్పుడు వైరస్‌ సోకిన వారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. కాలుష్యం, కరోనా కలిస్తే మరణాలు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని గులేరియా హెచ్చరించారు.

Next Story