కాళీచరణ్ మహారాజ్ అరెస్ట్‌

Police team sent to Maharashtra, Madhya Pradesh to nab Kalicharan Maharaj. మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారనే ఆరోపణపై

By Medi Samrat  Published on  30 Dec 2021 4:34 AM GMT
కాళీచరణ్ మహారాజ్ అరెస్ట్‌

మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారనే ఆరోపణపై మధ్యప్రదేశ్‌లోని ఖజురహోకు చెందిన హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ధర్మ సంస‌ద్ వేదిక‌గా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళీచరణ్ మహారాజ్ పై రాయ్‌పూర్‌లోని తిక్రపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని అధికారులు గురువారం తెలిపారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్ ధామ్ సమీపంలో కాళీచరణ్ మహరాజ్ అద్దెకు ఉంటున్నాడు.

ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు రాయ్‌పూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. "సాయంత్రానికి, పోలీసు బృందం రాయ్‌పూర్ చేరుకుంటుంది" అని ఎస్పీ రాయ్‌పూర్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ఇదిలావుంటే.. డిసెంబర్ 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేని అభినందిస్తూ కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతుంది. ప‌లుచోట్ల ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి.


Next Story