పరీక్షల్లో పాస్ అవ్వడానికి, ఎక్కువ మార్కులు రావడానికి కాపీ కొట్టడం కూడా ఒక మార్గంగా భావిస్తూ ఉంటారు. అలా కాపీలు కొట్టేయడానికి పలు మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత పరీక్షల సమయంలో మాస్కులను తప్పనిసరి చేశారు. అయితే మాస్కులను కూడా ఇప్పుడు కాపీలు కొట్టడానికి వాడేస్తూ ఉన్నారు. కరోనావైరస్ నుండి కాపాడుకోడానికి మాస్క్ లను ఉపయోగిస్తూ ఉంటుంటే..! మాస్కులను కాపీలు కొట్టడానికి వాడేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. అలాంటి ఉదాహరణ మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌లో కనుగొనబడింది.
హింజేవాడిలో పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష సమయంలో అతడు మాస్కును అదో రకంగా చూస్తూ ఉండడం వంటివి చేస్తుండడంతో పరీక్ష నిర్వహణాధికారులకు అనుమానం వచ్చింది. అతడి మాస్కును చూడగా అందులో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ దొరికింది. పోలీస్ కమీషనర్ పింప్రి చించ్వాడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు, ఆ తర్వాత అతడి నుండి ఎలక్ట్రానిక్ పరికరంతో కూడిన మాస్క్‌ను స్వాధీనం చేసుకున్నాము. మాస్క్ లో సిమ్ కార్డులు, మైక్రోఫోన్లు మరియు బ్యాటరీలు ఉన్నాయి. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మాస్క్‌లకు ఎలక్ట్రానిక్ స్ప్లిటింగ్‌కు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.