మోడల్ మోనా రాయ్ ను అందుకే హత్య చేశారు.. షాకింగ్ నిజాలు

Police arrest 'sharpshooter' accused of killing Bihari model Mona Rai. ఓ షార్ప్ షూటర్ ను పాట్నాలో ప్రముఖ మోడల్ మోనా రాయ్‌ను హత్య చేసినందుకు

By M.S.R  Published on  26 Oct 2021 6:41 PM IST
మోడల్ మోనా రాయ్ ను అందుకే హత్య చేశారు.. షాకింగ్ నిజాలు

ఓ షార్ప్ షూటర్ ను పాట్నాలో ప్రముఖ మోడల్ మోనా రాయ్‌ను హత్య చేసినందుకు బీహార్‌లోని మధుబని జిల్లాలోని భగవతిపూర్ గ్రామం నుండి పోలీసులు అరెస్టు చేశారు. భీమ్ యాదవ్ అనే షూటర్‌ను పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్, భోజ్‌పూర్ జిల్లా అర్రాలోని ఉద్వాంత్‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. మోడల్ మోనా రాయ్ అలియాస్ అనితా దేవిని అక్టోబర్ 12 న పాట్నాలోని ఆమె ఇంటి సమీపంలో ఆమె కొడుకు ముందే కాల్చారు. 6 రోజుల తర్వాత మోడల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నేర చరిత్ర ఉన్న భీమ్ యాదవ్ ఆమెను రూ.5 లక్షల కోసం కాల్చిచంపాడు. అతని అరెస్టును భోజ్‌పూర్ పోలీసు ఏఎస్పీ హిమాన్షు కుమార్ ధృవీకరించారు. అతని అరెస్టు తరువాత, పాట్నా పోలీసులు నిందితుడు షూటర్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఓ రియల్ ఎస్టేట్ బిల్డర్ భార్య రూ. 5 లక్షల సుపారీ ఇచ్చినట్టు తేలింది. తన కుటుంబంలోని సన్నిహితుల ద్వారానే ఆమె ఈ పని చేయించింది. షూటర్ భీమ్ యాదవ్‌ను అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో షూటర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య కేసు వెనుక ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు అనుమానించారు. అయితే బిల్డర్ మోనాకు భూమితో పాటు ఫ్లాట్ ఇచ్చాడని తెలుసుకున్నారు. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులకు తెలిసింది. ఈ విషయం తెలిసి బిల్డర్ భార్య తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెను హత్య చేయించింది. మోనాతో సంబంధం తెంచుకోవాలని బిల్డర్ భార్య పదే పదే భర్తకు చెప్పినా అతడు పట్టించుకోలేదు. దీంతో బిల్డర్ భార్య మోనాను చంపాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం షూటర్ భీమ్ యాదవ్‌కు రూ. 5 లక్షల ఇచ్చేందుకు అంగీకరించింది.


Next Story