ఆగస్ట్ 15 నాటికి 5జీ సిద్ధం

PMO pushes for 5G launch by August 15. ఆగస్ట్ 15, 2022 నాటికి భారత్లో 5G అందుబాటులోకి తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

By Medi Samrat
Published on : 26 Feb 2022 12:07 PM IST

ఆగస్ట్ 15 నాటికి 5జీ సిద్ధం

ఆగస్ట్ 15, 2022 నాటికి భారత్లో 5G అందుబాటులోకి తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) 5G కేటాయింపు ప్రక్రియ కోసం రిజర్వ్ ధర, నియమాలపై దాని సిఫార్సులను ఉపసంహరించుకోవాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)ని కోరింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కోరిక మేరకు మార్చిలోపు 5G వేలం కోసం స్పెక్ట్రమ్ రిజర్వ్ ధరపై సిఫార్సులను సమర్పించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) లేఖ రాసింది. ఆగస్టు 15 నాటికి 5G ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. రాబోయే వేలం విషయంలో 800 MHz, 900 MHz, 1800 MHz బ్యాండ్‌లలో అదనపు స్పెక్ట్రమ్ లభ్యత విషయంలో కూడా DoT ట్రాయ్‌కి తెలియజేసింది.

సాధారణంగా, నిర్ణీత కాలవ్యవధిలో తన సిఫార్సులను సమర్పించమని ట్రాయ్‌ని DoT అడగదు, కానీ ఈసారి, 5G సేవలను ప్రారంభించేందుకు అనధికారిక గడువు ఆగస్టు 15గా నిర్ణయించబడినందున, ప్రక్రియను వేగవంతం చేయడానికి సూచనలు వెళ్లాయి. టెలికాం ఆపరేటర్‌లకు వేలం వేసే అన్‌కంబర్డ్ స్పెక్ట్రమ్‌పై స్పష్టత అవసరం, దీంతో వారు ముందుగానే పరికరాల కోసం ఆర్డర్‌లు చేయవచ్చు. అన్ని టెల్కోలు ఇప్పటికే అప్‌గ్రేడ్ చేయడంతో అన్ని ఆపరేటర్‌ల నెట్‌వర్క్‌లను కొన్ని నెలల్లో 5G కోసం సర్వీస్లను అందించేందుకు సిద్ధంగా మార్చవచ్చు. US, చైనా, దక్షిణ కొరియా మరియు యూరోపియన్ దేశాలతో సహా అనేక దేశాలు ఇప్పటికే 5G సేవలను ప్రారంభించగా, భారతదేశం సన్నాహక దశలో ఉంది.


Next Story