మోదీ స్నేహితుడు అబ్బాస్ దగ్గరకు వెళ్తానని అంటున్న అసదుద్దీన్

PM Please Ask Your Friend Abbas If He Exists. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

By Medi Samrat  Published on  20 Jun 2022 1:29 PM GMT
మోదీ స్నేహితుడు అబ్బాస్ దగ్గరకు వెళ్తానని అంటున్న అసదుద్దీన్

నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తప్పో, ఒప్పో ప్రధాని నరేంద్ర మోదీ తన బాల్యమిత్రుడు అబ్బాస్ ను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల తన తల్లి హీరాబెన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి ప్రస్తావించడం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన తల్లి అబ్బాస్ ను కూడా తనతో పాటు సమానంగా చూసేదని మోదీ చెప్పారు.

ఒవైసీ స్పందిస్తూ.. "ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీ తన ఫ్రెండ్ ను గుర్తుచేసుకున్నారు. మీకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడని మాకు తెలియదు. మేం కోరేదేంటంటే... ఒకవేళ అబ్బాస్ అనే వ్యక్తి ఇంకా ఉంటే వెంటనే అతడికి కాల్ చేయండి. అసదుద్దీన్ ఒవైసీ, మతగురువుల ప్రసంగాలను వినమని చెప్పండి. మా ప్రసంగాల్లో ఏమైనా తప్పు ఉందా అని అతడిని అడగండి" అంటూ చెప్పుకొచ్చారు. అబ్బాస్ చిరునామా ఇస్తే నేను అతడి వద్దకు వెళతానన్నారు అసదుద్దీన్. నుపుర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరమో, కాదో అతడ్నే అడుగుతానన్నారు. అతడు అభ్యంతరకరమేనని అంగీకరిస్తే, నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవే అవుతాయని చెప్పుకొచ్చారు.








Next Story