గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని.. అందుబాటులోకి వ‌స్తే..

PM Narendra Modi lays foundation stone of Ganga Expressway. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో శ‌నివారం గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని నరేంద్ర మోదీ

By Medi Samrat  Published on  18 Dec 2021 9:36 AM GMT
గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని.. అందుబాటులోకి వ‌స్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో శ‌నివారం గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే. ఈ ఎక్స్‌ప్రెస్‌వే 2024 నాటికి అందుబాటులోకి రానుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉపాధికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే కొత్త మార్గాలను తెరుస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 594 కి.మీ కాగా.. దేశంలోని అత్యంత ప్ర‌ధాన‌ ప్రాంతాల గుండా ఉంటుంది. ఎన్‌సిఆర్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల గుండా వెళుతుంది. ఈ ప్రాంతాల రైతులు, పారిశ్రామికవేత్తలు, సామాన్య ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ యుపీలోని మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్ జిల్లాల గుండా వెళుతుందని తెలిపారు. హాపూర్, బులంద్‌షహర్‌తో సహా జిల్లాల ప్రజల రాకపోకల కోసం ఇప్పుడు గర్ముక్తేశ్వర్‌లో మరో వంతెనను నిర్మించనున్నారు.

మరోవైపు.. ఈ ఎక్స్‌ప్రెస్‌వే షాజహాన్‌పూర్ కంటే ముందుగా హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్‌లకు వెళుతుంది. ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఇప్పటివరకు భూసేక‌ర‌ణ‌ ప్రక్రియ దాదాపుగా(94 శాతం) జరిగిందని.. మిగిలింది త్వరలో జరుగుతుందని స‌మాచారం. గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళ విమానాలను ల్యాండింగ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కి.మీ మేర ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించబడుతుంది. ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పారిశ్రామిక కారిడార్ కూడా ఉంటుంది. 2025 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉందని మోదీ తెలిపారు.


Next Story