విషమంగా లాలూ ఆరోగ్యం

PM Narendra Modi dials Tejashwi Yadav. బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

By Medi Samrat  Published on  6 July 2022 7:06 PM IST
విషమంగా లాలూ ఆరోగ్యం

బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. లాలూను సీఎం నితీష్ కుమార్ ఇవాళ ప‌రామ‌ర్శించారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించనున్నారు. లాలూ ఆరోగ్యం బుధ‌వారం ఉద‌యం నాటికి మ‌రింత క్షీణించింది. దీంతో ఆయ‌న‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించ‌నున్నారు. లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆరా తీశారు. లాలూ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్‌కు మోదీ ఫోన్ చేశారు.

గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. లాలూను సీఎం నితీష్ కుమార్ ఇవాళ ప‌రామ‌ర్శించారు. లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆరా తీశారు. లాలూ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్‌కు మోదీ ఫోన్ చేశారు.









Next Story