అండగా ఉంటాం.. ఆదుకుంటాం: ప్రధాని మోదీ
PM Modi's packed schedule in Morbi. కేబుల్ వంతెన కూలి 130 మందికి పైగా మృతి చెందిన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ప్రధాని
By Medi Samrat Published on 1 Nov 2022 1:05 PM GMTకేబుల్ వంతెన కూలి 130 మందికి పైగా మృతి చెందిన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పర్యటించారు. బ్రిటీష్ కాలం నాటి సస్పెన్షన్ వంతెన ఆదివారం మచ్చు నదిలో కూలిపోయింది. వందకు పైగా మరణించారు. వంతెన కూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్న మోర్బీ సివిల్ ఆసుపత్రిని ప్రధాని మోదీ సందర్శించారు. పేషెంట్ల ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. మచ్చు నదిలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ప్రధాని మోదీ మోర్బీలో సంఘటన స్థలాన్ని సందర్శించారు. మోర్బిలో విషాదం తరువాత రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో పాల్గొన్న ప్రజలను కూడా ప్రధాని కలుసుకున్నారు.
ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టిన వారితో కూడా మోదీ మాట్లాడారు. ఆ తర్వాత మోర్బీ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని సమీక్ష జరిపారు. ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ చెప్పారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య 135కి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని.. మరో వంద మంది మృతదేహాలు నది అడుగుభాగంలో ఉన్న బురదలో కూరుకుపోయి ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.