ఇక ఆ ఆటలు సాగవు, కేరళలో బీజేపీ సర్కార్ ఖాయం..ప్రధాని ధీమా!

కేరళలోని పాలక్కాడ్‌లో నిర్వహించిన భారీ ఎన్‌డీఏ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై నిప్పులు చెరిగారు.

By -  Knakam Karthik
Published on : 29 March 2026 6:40 PM IST

National News, Kerala, PM Modi, Palakkad, BJP, NDA, LDF, UDF, Kerala Elections

ఇక ఆ ఆటలు సాగవు, కేరళలో బీజేపీ సర్కార్ ఖాయం..ప్రధాని ధీమా!

కేరళలోని పాలక్కాడ్‌లో నిర్వహించిన భారీ ఎన్‌డీఏ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై నిప్పులు చెరిగారు. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు కేరళను అవినీతికి, రాజకీయ అవకాశవాదానికి అడ్డాగా మార్చి రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

కేరళలో ఒకరినొకరు విమర్శించుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర రాష్ట్రాల్లో మాత్రం స్నేహంగా ఉంటాయని, వారి ద్వంద్వ వైఖరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందాల వల్ల కేరళ అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రం పంపే నిధులను సైతం వారు దుర్వినియోగం చేస్తున్నారని మోదీ ఆరోపించారు.

అయితే, ప్రస్తుతం కేరళలో మార్పు గాలి వీస్తోందని, ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతుల నుంచి బీజేపీకి భారీగా మద్దతు పెరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఈ రెండు కూటములు భయపడుతున్నాయని, వారి అక్రమాలు త్వరలోనే బయటపడతాయని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story