పక్క దేశం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ కరోనా బారినపడ్డారు. అయితే.. ఇమ్రాన్‌కు వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఇమ్రాన్‌కు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పాకిస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే.. ఈ విషయమై మన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కరోనా బారినపడ్డ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఇక పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 6,15,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 13,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో నమోదయ్యే ఎక్కువ కేసుల్లో పంజాబ్ వాటానే అధికంగా ఉంది. కరోనాను అంతం చేసేందుకు మార్చి 10నుంచి ఆదేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. ఫిబ్రవరి మొదట్లో ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వారియర్స్‌కు టీకా వేయగా ఇప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు.