నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి
నేడే పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేడు వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 9.33 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో రూ.2 వేలు పెట్టుబడి సాయం జమకానుంది. రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా సుమారు రూ.20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందుతారు.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ప్రతి ఏటా రూ.6 వేలు అందిస్తోంది. రైతులకు 20వ విడత పీఎం కిసాన్ కింద రూ.2 వేలు రావాలంటే రైతుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూరత్ఇ అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పీఎం కిసాన్‌కు సంబంధించి ఈ కేవైసీ అయ్యిందో లేదో అని pmkisan.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. కాగా 2019లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి, 19 వాయిదాల ద్వారా ₹ 3.69 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి.
రాబోయే 20వ విడత దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ మద్దతును మరింత బలోపేతం చేస్తుంది, ఇది రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శ్రేయస్సు పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. PM-KISAN పథకం అనేది భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019 లో ప్రారంభించిన కేంద్ర రంగ పథకం . ఈ పథకం కింద, సంవత్సరానికి రూ. 6,000/- ఆర్థిక ప్రయోజనం మూడు సమాన వాయిదాలలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.