వచ్చేస్తోంది.. బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనేక మంది సీనియర్ నాయకుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు

By Medi Samrat  Published on  13 April 2024 4:15 PM IST
వచ్చేస్తోంది.. బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనేక మంది సీనియర్ నాయకుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. "సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్" అంటూ సంకల్ప్ పత్రను ప్రజల కోసం విడుదల చేయనుంది. 'అబ్‌కీ బార్‌ 400 పార్ ' అనే లక్ష్యంతో బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేసింది.

అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను బీజేపీ తీర్చిదిద్దినట్లు తెలిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే రెండుసార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. సంకల్పపత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 15 లక్షల సూచనలు రాగా, ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పంచుకున్నారు.

Next Story