హృదయాన్ని కదిలించే ఘటన.. తల్లి పెయింటింగ్ చూసి కాన్వాయ్ ఆపేసిన ప్రధాని మోదీ..
PM Modi Stops His Car To Accept Painting of His Mother. హృదయాన్ని కదిలించే ఘటన ఓకటి ఈ రోజు చోటుచేసుకుంది. సిమ్లాలో ఒక అమ్మాయి
By Medi Samrat Published on 31 May 2022 5:01 PM ISTహృదయాన్ని కదిలించే ఘటన ఓకటి ఈ రోజు చోటుచేసుకుంది. సిమ్లాలో ఒక అమ్మాయి గీసిన తన తల్లి హీరాబెన్ మోడీ పెయింటింగ్‌ను స్వీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్యాయ్‌ను ఆపివేసారు. అమ్మాయి వద్దకు వచ్చి ఫెయింటింగ్‌ను తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లి ఫెయింటింగ్ చూడగానే ప్రధాని స్పందించిన తీరు నెట్టింట ప్రశంసలు అందుకుంటుంది. బాలికను, మోదీని మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది.
PM @narendramodi stopped his car to accept the painting from a girl in Shimla, Himachal Pradesh. pic.twitter.com/eHnUlS1GC4
— BJYM (@BJYM) May 31, 2022
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని అయ్యి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా రిడ్జ్ మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం వివిధ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొమ్మిది కోట్ల నకిలీ పేర్లను తొలగించిందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై ఘాటైన విమర్శలు చేశారు ప్రధాని మోదీ.. "2014కు ముందు ఉన్న ప్రభుత్వం అవినీతి వ్యవస్థలో ముఖ్య భాగమైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా.. దానికి లొంగిపోయింది.. పథకాల సొమ్ము పేదలకు చేరకుండా దోచుకోవడాన్ని దేశం చూసిందన్నారు.
నూతన ఇండియాను తయారు చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ''మన దేశంలో దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయి. సొంతంగా ఓటు బ్యాంకు సృష్టించుకునే రాజకీయాలు దేశానికి చాలా నష్టం చేశాయి. మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాము, ఓటు బ్యాంకు కాదు, "అని ప్రధాని మోడీ అన్నారు.
అది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లేదా స్కాలర్‌షిప్ లేదా మరేదైనా పథకం కావచ్చు, మేము ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం ద్వారా అవినీతి పరిధిని నిర్మూలించాము." "మేము ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా వివిధ పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ₹ 22 లక్షల కోట్లకు పైగా బదిలీ చేసాము" అని ప్రధాన మంత్రి తెలిపారు.