ఇడ్లీ, దోశ లాగా తమిళ భాష గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలి

అనేక సంవత్సరాలుగా తమిళనాడు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  1 April 2024 8:25 AM IST
ఇడ్లీ, దోశ లాగా తమిళ భాష గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలి

అనేక సంవత్సరాలుగా తమిళనాడు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమిళుల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయవలసిన అవసరాన్ని మోదీ చెప్పారు. తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మాట్లాడే భాష తమిళమని, ప్రజలు దాని గురించి ఎందుకు గర్వపడటం లేదని ఆశ్చర్యపోయారు. మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష ఉంది.. అది తమిళం అయినప్పటికీ మనం దాని గురించి గర్వపడడం లేదన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని ప్రశంసించాలి.. ప్రపంచవ్యాప్తంగా చర్చించాలని ప్రధాని మోదీ అన్నారు.

కొందరు నాయకులు భాషకు కూడా రాజకీయాలను జోడించారని మోదీ ఆరోపించారు. ఇడ్లీ, దోస వంటి దక్షిణ భారత ఆహారాలపై రాజకీయాలు ఉంటే తమిళనాడులోనే ఉండిపోయేవి.. ఇడ్లీ, దోసెల మాదిరిగానే తమిళ భాష కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుందని నేను నమ్ముతున్నానని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్‌కు తమిళనాడు అతిపెద్ద చోదక శక్తిగా మారుతుందని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువత, సాంకేతికత, పరిశ్రమలు ఉన్నాయని ఆయన అన్నారు. తమిళనాడులో ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే తాను పని చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. 'కేవలం ఎన్నికల్లో గెలవడమే నా లక్ష్యం అయితే, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నేను కృషి చేసేవాడిని కాదు. మాజీ ప్రధానులందరి కంటే ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాను. తమిళనాడు పర్యటనలు రాజకీయాల కోసమేనని నేను అనుకోను. తమిళనాడు ప్రజలు బీజేపీకి మద్దతివ్వడం లేదని నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు.' అని అన్నారు.

Next Story