పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.

By అంజి
Published on : 2 Aug 2025 11:48 AM IST

PM Modi, PM Kisan funds, Farmers, National news

పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో రూ.20 వేల కోట్లకుపైగా నిధులు రిలీజ్‌ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. 9.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తన అధికారిక హ్యాండిల్ లో ఈ నవీకరణను పంచుకుంది, ఈ వాయిదా వారణాసి నుండి నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరుతుందని పేర్కొంది. PM-Kisan పథకం అర్హతగల రైతులకు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మూడు విడతలుగా రూ. 2,000 అందిస్తోంది. ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులు, ఇంటి ఖర్చులకు సహాయపడుతుంది. ఇప్పటివరకు, 9.8 కోట్లకు పైగా రైతులు మునుపటి 19 వాయిదాల ద్వారా ప్రయోజనం పొందారు.

Next Story