దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు.. శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

PM Modi President Ram Nath Kovind extend greetings on Christmas.దేశ వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 10:09 AM IST
దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు.. శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

దేశ వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. క్రిస్మ‌స్‌ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. అర్థ‌రాత్రి నుంచే చ‌ర్చిల్లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. రంగురంగు కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, గాజు గోళాలతో అందంగా క్రిస్మ‌స్ ట్రీల‌ను అలంకరించారు. క‌రోనా, ఒమిక్రాన్ విజృంభ‌ణ నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుంటున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌డంతో అక్క‌డ ఉద‌యం ఆరు గంట‌ల త‌రువాత క్రిస్మ‌స్ వేడుక‌లు ప్రారంభం అయ్యాయి. క్రిస్మస్ ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశం, విదేశాలలో ఉన్న పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని సంకల్పిద్దాం. యేసుక్రీస్తు బోధలను మన జీవితంలో అనుసరిద్దామని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయం. కరుణ, ప్రేమ, సేవ, దయ కు యేసుక్రిస్తు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. యేసు జీవితం, బోధనలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆయూరారోగ్యాలతో సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. అంటూ ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

Next Story