రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీల వీడ్కోలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాజకీయాలకు ముగింపు ఉండదని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎంపీల సేవలను ఆయన ప్రశంసించారు. శాసనపరమైన చర్చలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "సభలో అనేక అంశాలపై చర్చ జరుగుతుంది.. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.. కొన్ని చేదు, తీపి అనుభవాలు కూడా ఉంటాయి. కానీ, అలాంటి అవకాశం వచ్చినప్పుడు, పార్టీ స్ఫూర్తికి అతీతంగా, మన సహచరులు ఇప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన పని కోసం ముందుకు వెళ్తున్నారనే ఉమ్మడి భావన సహజంగానే మనందరిలో కలుగుతుంది" అని అన్నారు.
"ఈ రోజు ఇక్కడ నుండి వీడ్కోలు పలుకుతున్న సహచరులలో.. కొందరు మళ్లీ రానుండగా, మరికొందరు వీడ్కోలు పలికిన తర్వాత ఈ ప్రదేశపు అనుభవాన్ని తమతో తీసుకువెళ్లి, సామాజిక జీవితానికి ఏదైనా ప్రత్యేకమైన సేవ చేయడానికి వెళ్తున్నారు" అని అన్నారు. వెళ్ళిపోతున్నా తిరిగి రాని వారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాలకు పూర్తి విరామం ఉండదు, భవిష్యత్తు మీ కోసం కూడా వేచి ఉంది. మీ అనుభవం, మీ సహకారం దేశ మనుగడలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి," అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. సభలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వాటిలో ప్రతి సభ్యుడు ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. అటువంటి సందర్భాలలో.. పార్టీలకు అతీతంగా పరస్పర గౌరవం ఏర్పడుతుంది. తమ పదవీకాలం పూర్తి చేసుకుని సభ నుండి నిష్క్రమిస్తున్న నాయకులకు నేను చెప్పేది ఏమిటంటే.. రాజకీయాలకు పూర్తి విరామం ఉండదన్నారు.