ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రశంసలు కురిపించారు.

By Medi Samrat  Published on  18 March 2025 3:46 PM IST
ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఐక్యత సందేశం అందిందని ప్రధాని అన్నారు. ప్రధాని ప్రకటనను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సమర్థించారు. ప్రధాని మోదీ ప్రసంగంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము కూడా ప్రధాని మోదీ మాట‌ల‌తో కొంతమేరకు ఏకీభవిస్తున్నామని అన్నారు. రాహుల్ ఇంకా మాట్లాడుతూ.. కుంభ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు అని రాహుల్ అన్నారు. మహాకుంభానికి వెళ్లిన యువత కూడా ప్రధాని మోదీ నుంచి ఉపాధి అనే మరో విషయాన్ని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్య నిర్మాణం ప్రకారం.. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం రావాలని, కానీ మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ నేత అన్నారు.

ఈరోజు పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ సెష‌న్ రెండో ద‌శ‌లో ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన మ‌హాకుంభ్ విజ‌యం గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. మహాకుంభ విజయానికి దేశంలోని కోట్లాది మంది ప్రజలు కారణమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహాకుంభ్ నిర్వహించిన తీరుకు దేశ పౌరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. మహాకుంభం సందర్భంగా ప్రపంచం మొత్తం భారతదేశ వైభవాన్ని చూసిందని ప్రధాని అన్నారు. గత ఏడాది అయోధ్యలోని రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం దేశం రాబోయే 1000 సంవత్సరాలకు ఎలా సమాయత్తం అవుతుందో మనందరికీ అర్థమయ్యేలా చేసిందని ప్రధాని అన్నారు. ఈ సంవత్సరం మహాకుంభ్ మన ఆలోచనను బలపరిచిందన్నారు.

Next Story