కేదార్‌నాథ్‌లో ప్రధాని న‌రేంద్ర మోదీ పూజలు

PM Modi performs puja at Kedarnath Temple in Uttarakhand.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్‌లో పర్య‌టిస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2022 11:56 AM IST
కేదార్‌నాథ్‌లో ప్రధాని న‌రేంద్ర మోదీ పూజలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్‌లో పర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ ఉద‌యం కేదార్‌నాథ్ ఆల‌య‌న్ని ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక వ‌స్త్ర‌ధార‌ణ‌లో కేదారేశ్వ‌రుడికి ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక చేశారు. బాబా కేదార్ ఆయ‌న‌కు హార‌తి ఇచ్చారు.

ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘనస్వాగతం పలికారు. ప్రధాని టూర్ సందర్భంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను క్వింటాళ్ల కొద్ది పూలతో అలంకరించారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు.

ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రూ. 3400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్ర‌ధాని శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాకుండా 9.7 కి.మీ పొడవైన గౌరీకుండ్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బద్రీనాథ్ చేరుకుని నదితీర వెంబడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకోనున్నారు. అనంతరం అరైవల్ ప్లాజా, సరస్సుల సుందరీకరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు.

Next Story