మనసంతా చంద్రయాన్-3 పైనే ఉంది : ప్రధాని మోదీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష నౌక చంద్రయాన్-3 చంద్రునిపై
By Medi Samrat Published on 23 Aug 2023 7:11 PM IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష నౌక చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేపట్టింది. దీంతో భారతదేశం చరిత్రను లిఖించగా, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అపూర్వమైన ఫీట్ ను వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఇదొక చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ.. మనం ఒక అద్భుతాన్ని చూశామన్నారు. అంతరిక్ష చరిత్రలో భారత్ కొత్త చరిత్రను లిఖించిందన్నారు. ఇది నవభారత విజయమని.. 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని అన్నారు మోదీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన జీవితం ధన్యమైందని అన్నారు. గగన్ యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని చెప్పారు.
చంద్రయాన్ 3 లో భాగంగా సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటిది . చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్ 3 ప్రయోగంలోని ప్రగ్యాన్ రోవర్.. చంద్రుడి ఉపరితలంపై దిగి పలు పరిశోధనలు జరపనుంది.