ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన

PM Modi Inaugurates Noida International Airport. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల జేవార్‌లో ఆసియాలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు.

By అంజి
Published on : 25 Nov 2021 3:42 PM IST

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల జేవార్‌లో ఆసియాలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో రెండవ అంతర్జాతీయ ఏరోడ్రోమ్ అయిన ఈ విమానాశ్రయం సెప్టెంబరు 2024 నాటికి ప్రారంభ సామర్థ్యంతో ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింగ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 1330 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ఎయిర్‌పోర్టు పూర్తి అయిన తర్వాత ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద ఎయిర్‌పోర్టు అవుతుంది.

ఇక దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు ఎయిర్‌పోర్టులను కలిగిన ఉన్న నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వచ్చే సంవత్సరం యూపీలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావలనుకుంటోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ ఎయిర్‌పోర్టు కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాకు మాత్రమే కాకుండా, మీరట్, మథుర, ఆగ్రా, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, బిజ్నోర్ మరియు మరెన్నో సమీప ప్రాంతాలకు కూడా ఎగుమతులకు కేంద్రంగా మారుతుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భూమిపూజ చేసినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఇది నోయిడా, పశ్చిమ యూపీని ప్రపంచ పటంలో ఉంచుతుందన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే అవుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Next Story