ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మైలురాయిని దాటిన తొలి ప్రపంచ నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2014లో ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరిన ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (43.2 మిలియన్లు) కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం. భారతదేశంలో కూడా ఇతర రాజకీయ నాయకుల కంటే మోదీ చాలా ముందున్నారు. యోగి ఆదిత్యనాథ్ (16.1 మిలియన్లు), రాహుల్ గాంధీ (12.6 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడి పార్లమెంట్ (కన్నెసెట్) అత్యున్నత గౌరవమైన "స్పీకర్ ఆఫ్ ది కన్నెసెట్ మెడల్"ను ప్రదానం చేసింది. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగిస్తున్నప్పుడు సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవేషన్) ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సంబంధాలు 2,000 ఏళ్ల నాటివని, భారతీయ సంస్కృతిపై ఇజ్రాయెల్‌కు ఉన్న గౌరవాన్ని కొనియాడారు.