పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్‌.. ఘటనా స్థలానికి వెళ్లాల‌ని ఆదేశం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.

By Medi Samrat
Published on : 22 April 2025 5:54 PM IST

పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్‌.. ఘటనా స్థలానికి వెళ్లాల‌ని ఆదేశం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు. 12 మంది గాయపడినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఘటనా స్థలాన్ని సందర్శించాల్సిందిగా హోంమంత్రిని ప్రధాని కోరారు. మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లోని బెస్రాన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులు, స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పర్యాటకులు, స్థానికులు సహా 12 మంది గాయపడ్డారు.

ఇదిలావుంటే.. భ‌ద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయపడిన పర్యాటకులను చికిత్స నిమిత్తం తరలించారు.

జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుండ‌టం గమనార్హం. అటువంటి పరిస్థితిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం.. ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడను సూచిస్తుంది. ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను ప్రభావితం చేయాలని భావిస్తున్నట్లు దాడిని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఎంత మంది.? ఈ దాడి ఎలా జరిగింది.? అనే విష‌య‌మై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

Next Story