మాక్ పార్లమెంట్ నిర్వహించి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ను ఎగతాళి చేసిన విపక్ష సభ్యుల తీరును ప్రధాని మోదీ ఖండించారు. ఈ విషయంపై రాజ్యసభ చైర్మెన్ జగదీప్‌కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని.. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని, ఇంకా అలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని ప్రధాని అన్నారు. రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్‌లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ధన్‌కర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వివరించారు.
మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు పార్లమెంట్ ద్వారం వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మన్ జగదీప్‌ను వెక్కిరిస్తూ నాటకం వేశారు. టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, చైర్మెన్ జగదీప్ తరహాలో నటిస్తూ ఆయన్ను అవమానించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నవ్వుతూ వీడియో తీశారు.