Video : న‌వ్వులు పూయించిన ప్ర‌ధాని మోదీ

జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు.

By Medi Samrat
Published on : 2 Sept 2025 4:48 PM IST

Video : న‌వ్వులు పూయించిన ప్ర‌ధాని మోదీ

జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈరోజు ఆయ‌న‌ SEMICON ఇండియా 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీలో ఫన్నీ యాంగిల్‌ కనిపించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం సందర్భంగా.. రెండు దేశాల పర్యటన గురించి ప్రస్తావిస్తూ “గత రాత్రి, నేను జపాన్ మరియు చైనా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాను చెప్ప‌గా.. అక్క‌డున్న వారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. నేను అక్కడికి వెళ్ళినందుకు మీరందరూ చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా? అని న‌వ్వుతూ ప్ర‌శ్నించారు. దీంతో అంద‌రూ న‌వ్వారు.

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పునాది కీలకమైన ఖనిజాలని, దేశం క్రిటికల్ మినరల్ మిషన్‌పై పని చేయడం ప్రారంభించిందని, అరుదైన ఎర్త్ ఖనిజాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశపై మేము పని చేస్తున్నాము" అని మోదీ చెప్పారు.

భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్పు తీసుకొచ్చే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. కొత్త డిఎల్‌ఐ (డిజైన్-లింక్డ్ ఇన్సెంటివ్) పథకానికి ప్రభుత్వం రూపుదిద్దుకోబోతోంది’ అని ప్రధాని మోదీ అన్నారు.

'డెడ్ ఎకానమీ' జిబేను పరోక్షంగా కొట్టిపారేసిన మోదీ.. ఆర్థిక స్వార్థంతో నడిచే అంతర్జాతీయ అనిశ్చితులు మరియు సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వద్ద వృద్ధి చెందిందని అన్నారు. అంచనాల కంటే భారతదేశం మరోసారి మెరుగైన పనితీరు కనబరిచిందని మోదీ అన్నారు.

Next Story