పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ

పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు

By Medi Samrat
Published on : 12 May 2025 8:30 PM IST

పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ

పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ తో చర్చలు జరపాలంటే తాము తీవ్రవాదం గురించే మాట్లాడుతామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలకు దిగినా తాము అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. నీళ్లు-రక్తం ఒకటేచోట ఉండవని తెలిపారు.

ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారని అన్నారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసిందని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో దాడులు చేశాయన్నారు. మనదేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని, మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసిందన్నారు.

Next Story