మోదీతో పాటూ ముఖ్యమంత్రులకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడంటే..?

PM Modi, CMs to reportedly get COVID-19 vaccine in 2nd phase. రెండో ద‌శ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే ప్ర‌ధాని మోదీతో పాటూ ముఖ్యమంత్రులకు కరోనా వ్యాక్సిన్.

By Medi Samrat  Published on  21 Jan 2021 12:40 PM GMT
PM Modi

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్లను వేయించుకుంటూ ఉన్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తీ చేయడానికి అధికారులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.

ఇక భారత ప్ర‌ధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకుంటారా అని దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మొద‌ట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉండగా.. మొద‌టి ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యి, రెండో ద‌శ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే ప్ర‌ధాని మోదీ వ్యాక్సిన్ వేయించుకోనున్నార‌ని తెలిసింది. అదే స‌మ‌యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ వ్యాక్సిన్ వేయించుకోనున్నారని తెలుస్తోంది.

ప్రాధాన్య క్రమం ప్రకారం రెండో ద‌శ‌లో 50 ఏళ్లకు పైబడిన వారికి, వివిధ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి మొద‌ట వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రుల‌తో పాటు 50 ఏళ్లు పైబ‌డిన‌ దేశంలోని అంద‌రు ఎంపీలు, ఎమ్మెల్యేల‌కూ వ్యాక్సిన్లు వేయ‌నున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవ‌డంలో తొంద‌ర ప‌డొద్ద‌ని.. రెండో ద‌శ‌లో అందరికీ వ్యాక్సిన్లు అందుతాయ‌ని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కూడా ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లుగా గుర్తిస్తూ వారికీ మొద‌టి ద‌శ‌లోనే వ్యాక్సిన్లు ఇవ్వాల‌ని హ‌ర్యానా, బీహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మోదీకి సూచించారు. అందుకు మోదీ ఒప్పుకోలేదు. రాజ‌కీయ నాయకులు ఎవ్వ‌రూ మొద‌టి ద‌శ‌లో వ్యాక్సిన్లు వేయించుకోవ‌ద్ద‌ని మోదీ స్ప‌ష్టం చేశారు.


Next Story