ప్రధాని మోదీతో ఉపవాసాన్ని విరమింపజేసింది ఎవరంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన 11 రోజుల నిరాహార దీక్షను విరమించారు.

By Medi Samrat  Published on  22 Jan 2024 4:11 PM IST
ప్రధాని మోదీతో ఉపవాసాన్ని విరమింపజేసింది ఎవరంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన 11 రోజుల నిరాహార దీక్షను విరమించారు. గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధాని మోదీకి 'చరణామృతం' తినిపించిన తర్వాత తన ఉపవాసాన్ని విరమించుకున్నారు. గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని మోదీ భక్తిని ప్రశంసించారు. జనవరి 12న అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగే వరకు 11 రోజుల ఉపవాసాన్ని ప్రారంభిస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఆడియో సందేశంలో మోదీ ఈ విషయాన్ని తెలిపారు.

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని.. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని అన్నారు. 2024 జనవరి 22, ఇది సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని ప్రధాని మోదీ తెలిపారు. రాముడు నాడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారింది, మళ్లీ ఇప్పుడు మారిందని వివరించారు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడ్ని వేడుకుంటున్నానని అన్నారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారు. భారత న్యాయవ్యవస్థ వారి స్వప్నాన్ని సాకారం చేసిందని మోదీ అన్నారు. దేశమంతా ఈ రోజు దీపావళి జరుపుకోవాలి. దేశంలోని ప్రతి ఇంట్లో ఇవాళ రాముడి పేరిట దీపాలు వెలగాలన్నారు.

Next Story