మ‌రో 30 నిమిషాల్లో రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 2:17 PM IST

మ‌రో 30 నిమిషాల్లో రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. పీఎం కిసాన్ 21వ వాయిదా మొత్తాన్ని ప్రధాని మోదీ రైతుల‌ ఖాతాల్లోకి పంప‌నున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం.. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 19 నవంబర్ 2025న తమిళనాడులోని కోయంబత్తూరులో PM-KISAN 21వ విడతను ప్రారంభిస్తారు." దాదాపు రూ.18,000 కోట్లు డీబీటీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయనున్నారు. వెబ్‌సైట్ ప్రకారం.. 9 కోట్ల మందికి పైగా PM-కిసాన్ లబ్ధిదారులు మధ్యాహ్నం 1:30 గంటలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం కింద నిధులను అందుకుంటారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అయితే.. 2 గంటలైంది కానీ ఇంతకీ న‌గ‌దు వాయిదా ఎందుకు విడుదల చేయలేదు..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ కార్యక్రమానికి ఎక్కువ సమయం పట్టింది, దీని కారణంగా 21వ విడత విడుదల చేయడానికి ఆయన ఇంకా కోయంబత్తూరు చేరుకోలేదు. అయితే, కాసేపట్లో కోయంబత్తూర్ చేరుకున్న తర్వాత, ఆయ‌న‌ పీఎం కిసాన్ యోజన 21వ విడతను విడుదల చేయనున్నారు.

లబ్ధిదారుని స్టేట‌స్‌ ఎలా తనిఖీ చేయాలి?

1. అధికారిక PM కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.inని సందర్శించండి.

2. హోమ్‌పేజీలో, 'ఫార్మర్స్' కార్నర్' కింద, 'లబ్దిదారుల జాబితా'పై క్లిక్ చేయండి.

3. మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ మరియు గ్రామాన్ని నమోదు చేయండి.

4. మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను వీక్షించడానికి 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి.

Next Story