రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు విడతలుగా ఏటా రూ.6,000 అందజేస్తుంది. ఇప్పటి వరకు 18 విడతలు విజయవంతంగా రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు.
ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా 19వ విడత రైతుల ఖాతాలకు ఫిబ్రవరి 24, 2025న బదిలీ చేయబడుతుంది. ఆ రోజున బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా నిధులను విడుదల చేస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించినట్లుగా.. ఆ తేదీ నుంచి రూ. 2,000 మొత్తం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది.
కాగా ఈ పథకానికి రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి, లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయడానికి ఇవాళే చివరి తేదీ. pmkisan.gov.in సైట్‌లో సులభంగా ఈ కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక కుడి వైపున ఉండే ఈ కేవైసీపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు upfr.agristack.gov సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.