పీఎం కిసాన్‌ 18వ విడత నిధులు.. రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే

కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.

By అంజి  Published on  25 Sept 2024 6:28 AM IST
PM Kisan, PM Kisan funds, farmers, National news

పీఎం కిసాన్‌ 18వ విడత నిధులు.. రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే

కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రూ. 2 వేలు చొప్పున మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతలుగా పీఎం కిసాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ పెట్టుబడి సాయం కోసం దేశంలో రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నిధుల ద్వారా దాదాపు 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అయితే, 18వ విడతలో రూ. 2,000 పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

మొదటి ఈ-కేవైసీ: గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 'పీఎం కిసాన్ మొబైల్ యాప్'లో ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను ఉపయోగించి రైతులు తమ ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి ఈ-కేవైసీని పూర్తి చేయొచ్చు. లేదంటే దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ లో eKYCని పూర్తి చేయొచ్చు. మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్‌ని ధృవీకరించాలి. అలాగే రైతులు తమ భూ రికార్డులను ధృవీకరించాల్సి ఉంటుంది. భూ రికార్డుల సరిగా లేకపోతే.. పీఎం కిసాన్ విడత నిధులు జమ అవడంలో ఆలస్యమవుతుంది.

Next Story