తేజస్ యద్ధ విమానంలో విహరించిన నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యద్ధ విమానంలో విహరించారు.
By Medi Samrat Published on 25 Nov 2023 9:30 AM GMTప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను ప్రధాని మోదీ సందర్శించారు. అంతేకాకుండా ఆయన ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని.. ఇదొక గొప్ప అనుభవమని ప్రధాని మోదీ అన్నారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనన్నారు.
రక్షణ వ్యవస్థకు సంబంధించి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాన మంత్రి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. భారత్ తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్‌ను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. US రక్షణ దిగ్గజం GE ఏరోస్పేస్ సంయుక్తంగా Mk-II-Tejas కోసం ఇంజన్‌లను ఉత్పత్తి చేసేందుకు HALతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ₹15,920 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్‌లో పేర్కొన్నారు. ఇది దేశానికి అపురూపమైన విజయమని ఆయన అన్నారు.